ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ అక్టోబర్2వ తీదీన 1959లో బషీరుబాగులో ప్రభుత్వ శిక్షణాకళాశాల పేరుతో స్థాపించబడింది. ఆ తర్వాత ప్రభుత్వ విద్యా కళాశాల పేరుతో మాసబ్ టాంక్ కి మార్చబడింది. ఈకళాశాలలో వివిధ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల "Government Comprehensive College of Education" అని పేరును మార్చారు. ఉపాధ్యాయ విద్యలో పలు మార్పులు సంస్కరణలు రావడం వల్ల ఈ కళాశాల Government Institute of Advanced Studies In Education హోదా పొందింది. ఈ కళాశాల. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉంది. ఈ కళాశాలలోపూర్వ- ఉపాధ్యాయ(ఉపాధ్యాయులు కాని వారికి) శిక్షణ ప్రవేశానికి ఆయా కోర్సులలో ప్రతి సంవత్సరము ఎల్ పి.సెట్ (ప్రభుత్వ పరంగాను), పరీక్ష మరియి బి.ఎడ్., ఎం.ఎడ్., లకు ఉస్మానియా విశ్వవిద్యాలయము పరంగాను ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలలో ఎంపికైన విద్యార్థులకు మాత్రమే ఈ సంస్థలో ప్రవేశం ఉంటుంది. ప్రస్తుతం బడులలో లేదా కళాశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విషయపరంగా లేదా బోధనా పద్ధతుల పైన లేదా శిక్షణ లేదా కార్యశాలలను నిర్వహించగలరు. విద్యా పరిశోధనలపై తగిన సూచనలు, సలహాలను ఇవ్వగలరు.
No comments:
Post a Comment